టుడే న్యూస్‌ రౌండప్‌ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Published Thu, May 31 2018 6:01 PM

Today News Roundup 31th May - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా 4 లోక్‌సభ, 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోరపరాజయంపై కేంద్ర మంత్రి, పార్టీ సీనియర్‌ నేత రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు. భారీ విజయాలు అందుకునే క్రమంలో ఎవరైనా రెండు అడుగులు వెనక్కి వేయాల్సి ఉంటుందని..భవిష్యత్‌లో భారీ ముందడుగు వేయబోతున్నామని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ ఓటమి విజయానికి సంకేతం..
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 4 లోక్‌సభ, 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోరపరాజయంపై కేంద్ర మంత్రి, పార్టీ సీనియర్‌ నేత రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు.

తొలి ముస్లిం లోక్‌సభ సభ్యురాలు
లక్నో: కైరానా (యూపీ) లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన తబస్సుమ్‌ హసన్‌ చరిత్ర సృష్టించారు. 

కైరానా విపక్షాల కైవసం
సాక్షి, న్యూఢిల్లీ : కైరానా(ఉత్తరప్రదేశ్‌) లోక్‌సభ స్థానాన్ని విపక్షాలు కైవసం చేసుకున్నాయి.

‘భారత్‌ ప్రపంచ శక్తిగా ఎదుగుతోంది’
సాక్షి, హైదరాబాద్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనలో భారత్‌ ప్రపంచ శక్తిగా ఎదుగుతోందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు.

మన్మోహన్‌ సింగ్‌పై కేజ్రీవాల్‌ ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

భారత్‌ కోసం అమెరికా చరిత్రాత్మక నిర్ణయం
వాషింగ్టన్‌, అమెరికా : భారత్‌ అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. రక్షణ రంగంలో కూడా భారత్‌ పటిష్టమవుతోంది. 

మాపై దయచూపగ.. మీరే రావాలి
పశ్చిమ గోదావరి : ఈ ప్రభుత్వంలో మాకు ప్రాధాన్యం లేదు.. మా సమస్యలు పట్టించుకునేనాథులు లేరు.

చంద్రబాబుపై పవన్‌ ఫైర్‌..
సాక్షి, విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఫైర్‌ అయ్యారు. 

సర్పంచ్‌ ఎన్నికలు: బ్యాలెట్‌ పేపర్‌పై మరో గుర్తు
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో జూలైలో జరగనున్న పంచాయితీ ఎన్నికల్లో దేశంలో తొలిసారిగా నోటా (పై వారెవరూ కాదు) ఆప్షన్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ధోనికి, నాకు బాగా కలిసొచ్చింది..!
సాక్షి, చెన్నై : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) -11లో ఒక్కో జట్టుది ఒక్కో అనుభవం. అయితే విజేతగా నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లకు మాత్రం ఈ సీజన్‌ ప్రత్యేకమని చెప్పవచ్చు.

రాందేవ్‌ బాబా ‘కింబో’ యాప్ మహా డేంజర్‌..!
న్యూఢిల్లీ : ప్రముఖ మెసేజింగ్‌ మాధ్యమం వాట్సాప్‌కు కిల్లర్‌గా, బాబా రాందేవ్‌ స్వదేశీ యాప్‌ అంటూ తీసుకొచ్చిన ‘కింబో’ యాప్‌తో ప్రమాదమేనట.

‘నా రియల్‌ హీరో.. నా మెంటర్‌’
నేడు సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ట్విటర్‌లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
 

Advertisement
Advertisement